డిసెంబర్ 9న కత్రినా-విక్కీ పెళ్లి.. ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలిసింది!
on Nov 27, 2021
మరికొద్ది రోజుల్లో జరగనున్న కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి బరాత్‌లో ఎవరు పాల్గొంటారు? ఇప్పుడు మనకు ఆ విషయం తెలిసింది. డైరెక్టర్ శశాంక్ ఖైతాన్ ఈ బరాత్‌కు హాజరవుతాడు. పెళ్లికి కన్ఫామ్ అయిన ఫస్ట్ గెస్ట్స్‌లో ఆయన ఒకడు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని అందమైన 14వ శతాబ్దపు కోటలో పంజాబీ సంప్రదాయం ప్రకారం వివాహం జరగనుంది. కోట, దాని లోపలి రెండు రాజభవనాలు, రెండు దేవాలయాలను 'సిక్స్ సెన్సెస్ రిసార్ట్ అండ్ స్పా'గా మార్చారు. ఇందులో బర్వారా సరస్సు కూడా ఉంది. కత్రినా, విక్కీ మొత్తం రిసార్ట్‌ను తమ పెళ్లి వేడుక కోసం బుక్ చేసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.
కత్రినా, విక్కీ వివాహం డిసెంబర్ 9న జరగనుంది. దానికంటే ముందు 7న నిశ్చితార్ధం, 8న మెహందీ, సంగీత్ వేడుకలు జరుగుతాయి. ట్రెడిషనల్, మోడరన్ కలయికగా ఆ జంట ఈ వేడుకను ప్లాన్ చేసింది. "ఇది వారి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన సందర్భం. అందుకే ప్రతి జ్ఞాపకం మరపురానిదిగా ఉండాలని వారు భావిస్తున్నారు. ఇటీవలే పూర్తయిన విక్కీ సినిమా 'గోవిందా మేరా నామ్'ను డైరెక్ట్ చేసిన శశాంక్ ఖైతాన్ వివాహంలో భాగమైన బరాత్‌కు గెస్ట్‌గా హాజరవుతున్నాడు. ఈ జంటకు సన్నిహితుడైనకరణ్ జోహార్ కూడా అక్కడ ఉంటారు. ఇక కత్రినా పరివారంలో లేడీ డైరెక్టర్స్ ఫరా ఖాన్, జోయా అఖ్తర్ భాగం కానున్నారు. కత్రినా క్లోజ్ ఫ్రెండ్స్ అర్పితా శర్మ, అల్విరా అగ్నిహోత్రి కూడా ఈ వెడ్డింగ్‌కు అటెండ్ అవుతారు. అయితే వారి అన్న సల్మాన్ ఖాన్ మాత్రం దీనికి హాజరు కావట్లేదు. ఎందుకంటే ఆ టైమ్‌లో ఆయన ఒక షో నిమిత్తం యుఏఈలో ఉంటారు కాబట్టి." అని కత్రినా సన్నిహిత వర్గాలు తెలిపాయి.
పెళ్లికి ముందే ఖరీదైన ఫ్లాట్ అద్దెకు తీసుకున్న కత్రినా-విక్కీ జంట! డిసెంబర్‌లో కాపురం!!
కొన్ని నెలల క్రితమే విక్కీకి చెందిన అంధేరీ అపార్ట్‌మెంట్‌లో రోకా వేడుక జరిగినట్లు సమాచారం. పెళ్లి వేడుకకు ముందుగా రిసార్ట్‌లో కత్రినా చున్నీ-సాగై వేడుక (నిశ్చితార్ధం) జరగనున్నాయి. ఇదివరకు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ పెళ్లి తరహాలోనే విక్కీ-కత్రినా పెళ్లి కూడా ఇటు హిందూ, అటు క్రిస్టియన్ పద్ధతుల్లో జరగనుంది. కత్రినా ఫ్యామిలీ మొత్తం.. ఆమె తల్లి సుజానే తుర్కోట్, ఆరుగురు సిస్టర్స్, బ్రదర్ ఈ పెళ్లికి హాజరు కానున్నారు. అలాగే విక్కీ తల్లితండ్రులు శ్యామ్ కౌశల్, వీణా కౌశల్, బ్రదర్ సన్నీ అటెండ్ అవుతారు.
పెళ్లి తర్వాత కాపురం కోసం ఇప్పటికే ముంబైలోని ఒక లగ్జరీ కాంప్లెక్స్‌లో విలాసవంతమైన ఒక డూప్లెక్స్ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుంది కత్రినా-విక్కీ జంట. నెలకు దాని అద్దె రూ. 8 లక్షలు కావడం విశేషం. ఐదేళ్ల పాటు అందులో ఉండేందుకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.
ఆర్థిక నేరగాడు సుఖేశ్‌తో రిలేషన్‌షిప్‌లో జాక్వలిన్? ఫొటో వైరల్!
Also Read